
మన తెలంగాణ/శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఆర్ఐ అధికారులు ఆదివారం రూ.4.5 కోట్ల విలువ చేసే 4.5 కిలోల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో హైడ్రోపోనిక్ కలుపు గంజాయిని అక్రమంగా బ్యాంకాక్ నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి తరలిస్తున్న ఓ ప్రయాణికురాలి కదలికలపై అనుమానం వచ్చి తనిఖీ చేశారు. ఆమె తీసుకువచ్చిన సూటుకేసులో రహ స్య పోరలో 4.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని ఎన్టిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.




