
ఏర్పాట్లు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు
కలెక్టర్ల చేతుల మీదుగా సోమవారం ఉదయం 11 గంటలకు డ్రా ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం షాపులకు నేడు డ్రా నిర్వహించడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. హైకోర్టు నుంచి మద్యం షాపులకు అనుమతి రావడంతో ఏర్పాట్లను చేసుకోవాలని అధికారులకు ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ అదేశాలివ్వడంతో అధికారులు ఏర్పాట్ల చేస్తున్నారు. మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులను డ్రా (లాటరీ) పద్దతిలో మద్యం షాపుల లైసెన్స్‌ల ఎంపిక జరుగుతుంది. జిల్లాల వారీగా నేడు ఉదయం 11 గంటలకు దరఖాస్తులు దాఖలు చేసిన వారి సమక్షంలో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ఈ డ్రా ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 34 కేంద్రాల్లో జిల్లాల వారీగా కలెక్టర్‌ల చేతులమీదుగా ఈ డ్రాను నిర్వహించనున్నారు. మొత్తం 95,137 దరఖాస్తులకు గాను రూ.2,854.11 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది.
రంగారెడ్డి డిసి పరిధిలో అధికంగా దరఖాస్తులు…
అధికంగా దరఖాస్తులు రంగారెడ్డి డిసి పరిధిలో వచ్చాయి. దరఖాస్తుల్లో అధికంగా శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో వచ్చాయి. శంషాబాద్ పరిధిలోని 100 షాపులకు గాను 8,536 దరఖాస్తులు వచ్చాయి. ఇక, రెండోస్థానంలో సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసు నిలిచింది. సరూర్‌నగర్ పరిధిలో 134 షాపులు ఉండగా 7,845 దరఖాస్తులు, మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 114 షాపులకు గాను 6,063 దరఖాస్తులతో మూడోస్థానంలో నిలిచింది. వాటితో పాటు మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 88 షాపులకు గాను 5,168 దరఖాస్తులు, నల్లగొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 155 షాపులకు గాను 4,906 దరఖాస్తులు, సంగారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 101 షాపులకు గాను 4,432 దరఖాస్తులు, ఖమ్మం పరిధిలోని 122 షాపులకు గాను 4,430 దరఖాస్తులు వచ్చాయి. ఇక, కొత్తగూడెంలోని 88 షాపులకు 3,922 దరఖాస్తులు రావడం విశేషం.
జిల్లాల వారీగా డ్రాలు జరిగే….
అదిలాబాద్‌లో 40 మద్యం షాపులకు 771 దరఖాస్తులు రాగా (రత్నా గార్డెన్ మావాలలో) డ్రా నిర్వహించనున్నారు. కొమురం భీం అసిఫాబాద్‌లో 32 షాపులకు 680 దరఖాస్తులు (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), మంచిర్యాలలో 73 షాపులకు 1,712 (పివిఆర్ గార్డెన్‌లో), నిర్మల్‌లో 47 షాపులకు 3,002 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), జగిత్యాలలో 71 షాపులకు 1,966 రాగా (విరూపాక్షి గార్డెన్)లో, కరీంనగర్‌లో 94 షాపులకు 2,730 (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), పెద్దపల్లిలో 77 షాపులకు 1,507 దరఖాస్తులు రాగా (స్వరూప గార్డెన్‌లో), రాజన్న సిరిసిల్లలో 48 షాపులకు 1,381 రాగా, (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), ఖమ్మంలో 122 షాపులకు 4,430 దరఖాస్తులు రాగా (సిక్వేల్ క్లబ్), కొత్తగూడెంలో 88 షాపులకు 3,922 రాగా (కొత్తగూడెం క్లబ్‌లో), జోగులాంబ గద్వాలలో 36 షాపులకు 774 రాగా (ఐడిఓసి కాంప్లెక్స్‌లో), మహబూబ్‌నగర్‌లో 90 షాపులకు 2,487 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), నాగర్‌కర్నూల్‌లో 67 షాపులకు 1,518 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), వనపర్తిలో 37 షాపులకు 757 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), మెదక్‌లో 49 షాపులకు 1,920 దరఖాస్తులు రాగా (శ్రీ వెంకటేశ్వర కాంప్లెక్స్‌లో), సంగారెడ్డి 101 షాపులకు 4,432 దరఖాస్తులు రాగా (జెఎస్‌ఆర్ గార్డెన్, పంక్షన్‌హాల్‌లో), సిద్దిపేట్ లో 93 షాపులకు 2,782 దరఖాస్తులు రాగా (సిసి గార్డెన్, కరీంనగర్ రోడ్డు), నల్లగొండలో 155 షాపులకు గాను 4,906 దరఖాస్తులు రాగా (లక్ష్మీగార్డెన్ హైదరాబాద్ రోడ్డులో), సూర్యాపేట్‌లో 99 షాపులకు గాను 2,771 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), యాదాద్రి భువనగరిలో 82 షాపులకు 2,776 దరఖాస్తులు రాగా (రాధాకృష్ణ పంక్షన్‌హాల్‌లో), కామారెడ్డిలో 49 షాపులకు 1,502 దరఖాస్తులు రాగా (రేణుకాదేవి, కళ్యాణమండపంలో), నిజామాబాద్‌లో 102 షాపులకు 2,786 దరఖాస్తులు రాగా (భారతి గార్డెన్‌లో), మల్కాజిగిరిలో 88 షాపులకు 5,168 దరఖాస్తులు రాగా (పాలనీ కన్వేషన్‌లో), ( మేడ్చల్‌లో 114 షాపులకు 6,063 దరఖాస్తులు రాగా (పాలనీ కన్వేషన్‌లో), సరూర్‌నగర్‌లో134 షాపులకు 7,845 దరఖాస్తులు రాగా (మల్లిక కన్వేన్షన్‌లో), శంషాబాద్‌లో100 షాపులకు 8,536 దరఖాస్తులు రాగా (మల్లిక కన్వేన్షన్‌లో), వికారాబాద్‌లో 59 షాపులకు 1,808 దరఖాస్తులు రాగా (అంబేద్కర్ భవన్‌లో), జనగాంలో 47 షాపులకు 1,697 దరఖాస్తులు రాగా (నందన్ గార్డెన్‌లో), భూపాలపల్లిలో 60 షాపులకు 1,863 దరఖాస్తులు రాగా (ఇల్లెంద్ క్లబ్‌హౌజ్‌లో), మహబూబాబాద్‌లో 59 షాపులకు 1,800 దరఖాస్తులు రాగా (ఏబి పంక్షన్‌హాల్‌లో), వరంగల్ రూరల్‌లో 63షాపులకు 1,958 దరఖాస్తులు రాగా (నానీ గార్డెన్‌లో), వరంగల్ అర్బన్‌లో 65 షాపులకు 3,175 దరఖాస్తులు రాగా (అంబేద్కర్ భవన్, గోకుల్‌నగర్, హన్మకొండలో) ఈ డ్రాను నిర్వహిస్తారని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.




