
మన తెలంగాణ/హైదరాబాద్: నెలాఖరులోగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం పూర్తి చేస్తామని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సూచనప్రాయంగా చెప్పారు. శనివారం ఢిల్లీలో కెసి వేణుగోపాల్‌తో సిఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీ నాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమా ర్క, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మ హేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, సం ఘటన్ సుజన్ అభియాన్‌కు చెందిన పలువురు పరిశీలకులు సమావేశమయ్యారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నందున జిల్లా పార్టీలు బలోపేతంగా ఉండాల్సిన అవశ్యకత గురించి
సిఎం రేవంత్‌రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారని తెలిసింది. అం దుకు కెసి వేణుగోపాల్ స్పందిస్తూ సాధ్యమైనంత త్వర గా నియమించాలన్న ఆలోచనతో ఉన్నామని, దేశంలోని మరి కొన్ని రాష్ట్రాల జిల్లాల కమిటీల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తి కావచ్చందని, వాటితో పాటు తెలంగాణ డిసిసి అధ్యక్షులనూ నియమిస్తామని వివరించారు. ఏఐసిసి నియమించిన ఇరవై రెండు మంది పరిశీలకులు తమకు కేటాయించిన జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలే కాకుండా స్థానికంగా ఉండే వివిధ సంఘాలతో, స్వచ్చంధ సంస్థల ప్రతినిధుల అభిప్రాయలను సేకరించారని కెసి వేణుగోపాల్ తెలిపారు.
అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తమకు సమర్పించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించామని, ఇందులో కొన్ని జిల్లాల్లో మూడు పేర్లు ఉంటే, మరి కొన్ని జిల్లాల్లో ఐదు, ఆరు పేర్లతో కూడిన జాబితాలను అందజేశారని ఆయన తెలిపారు. మూడు పేర్లతో జాబితాలు ఇవ్వాల్సిందిగా వారికి అందజేసిన మార్గదర్శకాల్లో చెప్పామని, అయితే బలమైన నాయకులు, ఉండడం, మహిళలు, సామాజిక సమతుల్యత కోసం ఐదు, ఆరు పేర్లతో జాబితాలు ఇవ్వాల్సి వచ్చిందని పరిశీలకులు చెప్పారని ఆయన తెలిపారు. వీటిని మరోసారి పరిశీలించి, వడపోసి మూడు పేర్లతో తుది జాబితాను సిద్ధం చేసి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముందు పెట్టి ఖరారు చేస్తామని ఆయన వివరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తమ పరిశీలకులు ఎవరి వత్తిళ్ళకు లొంగకుండా జాబితాలు సిఫార్సు చేశారని ఆయన చెప్పారు.డిసిసి అధ్యక్షులుగా ఉన్న వారు తిరిగి పోటీ చేయరాదన్న నియమం ఉండడం ఒక రకంగా మంచిదేనని, దీని వల్ల పార్టీలో కొత్త ఇంకా యువతరాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందన్న అభిప్రాయాన్ని పార్టీ రాష్ట్ర నాయకులు వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి, ముఖ్య నేతలంతా హస్తినలోనే..
ఇదిలాఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తదితర ముఖ్య నాయకులు ఢిల్లీలోనే ఉన్నారు. ఆదివారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. బిసి రిజర్వేషన్ల కోసం తాము చేసిన కృషిని, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్న విషయాన్ని వివరించనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించి, ఏఐసిసి అగ్ర నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అందజేస్తామని పార్టీ రాష్ట్ర నాయకులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇంకా ఏఐసిసి ముఖ్య నేతలతోనూ మంతనాలు జరిపే అవకాశం ఉంది.
అధిష్టానానికి సమాచారం ఇచ్చాం..ః భట్టివిక్రమార్క
ఇదిలాఉండగా కెసి వేణుగోపాల్‌తో సమావేశం ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ డిసిసి అధ్యక్షుల ఎంపిక విషయంలో అధిష్టానానికి సమాచారం అందించామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. డిసిసి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే గ్రామ, వార్డు స్థాయి నుంచీ కమిటీల ఎంపికను పూర్తి చేసి పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సేవలో నిమగ్నం అయ్యేలా చూస్తామన్నారు.




