
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రభుత్వ పరీక్ష విభాగం ప్రకటించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈనెల 30వ తేదీ నుంచి నవంబర్ 13 లోపు విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని తెలిపింది. హెచ్‌ఎంలు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డాటాను నవంబర్ 18 లోపు డిఇఒలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్ 29 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 2 నుంచి 11వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 15 నుంచి 29 వరకు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.




