Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedగురువారం రాశి ఫలాలు (23-10-2025)

గురువారం రాశి ఫలాలు (23-10-2025)

మేషం – ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులు స్నేహితులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి.

వృషభం – పనులలో విజయం సాధిస్తారు. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. ఖర్చులు కొంత అధికమవుతాయి. బంధువులతో ఆనందంగా మెలుగుతారు.

మిథునం – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. విందు వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వస్రాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం – ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలుగుతాయి.

సింహం – పాత మిత్రులను కలుస్తారు. మీ మానసిక ఆనందం మెరుగుపడుతుంది. సంతోషకరమైన శుభవార్తలు వినగలుగుతారు. పిల్లలతో పెద్దలతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు.

కన్య – ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.

తుల – భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది.దూరపు బంధువులను కలిసి యోగక్షేమాలు ఆరా తీస్తారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. మానసిక ఆనందం కలుగును.

వృశ్చికం – భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుంటుంది.

ధనుస్సు – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి.

మకరం – ఇంట్లో పెద్దల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది.జీవిత భాగస్వామితో స్వల్ప మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించాలి. నూతన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు

కుంభం – నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

మీనం – కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments