
మన తెలంగాణ/హైదరాబాద్ : పట్టణాల్లోని పేదలకు జి ప్లస్ 1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లు క ట్టుకునే అవకాశం కల్పించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహా ని ర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పై బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మం త్రి హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు పక్కా ఇంటి వసతిని కల్పించేలా ఇందిరమ్మ పథకాన్ని వర్తింప చేస్తున్నామన్నారు. కనీసం 30 చదరపు మీట ర్ల విస్తీర్ణంలో జి ప్లస్ 1 తరహాలో ఇంటిని ని ర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 200 చదరపు అడుగులు మొదటి అంతస్తులో మరో 200 చదరపు అడుగులు నిర్మించుకునేలా ఈ మేరకు జీఓ ఎంస్ నెం 69 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
పట్టణ ప్రాం తాల్లో పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించాలన్న లక్ష్యంతో పాటు, స్థలాల కొరత ను దృష్టి లో ఉంచుకుని కొన్ని సడలింపులు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అనేక పట్టణాలు, నగరాల్లోని పేదలు సొంత ఇంటిని నిర్మించుకోడానికి తగిన స్థలం లేక , అరకొర వసతులతో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారని, వారి కోసం ఇం దిరమ్మ ఇండ్ల ను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. పట్టణాల్లో 60 చ దరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలోని రేకు ల షెడ్లు, ఇతరత్రా తాత్కాలిక ఏర్పాట్లుతో జీవిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి ఆర్ సిసి స్లాబుతో పక్కా ఇంటిని నిర్మించాలంటే తగిన స్థలం అందుబాటులో లేదని, ఈ సమస్యను అధిగమించడానికి పట్టణ ప్రాం తాల్లో జి ప్లస్ 1 నిర్మాణాలకు అనుమతిస్తూ, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు ప్రభు త్వం నిర్ణయం తీసుకుందన్నారు. జి ప్లస్ 1 విధానంలో పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు 96 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 70 అడుగుల విస్తీర్ణంలో వేర్వేరుగా రెండు గదులతోపాటు, కనీసం 35.5 చదరపు అడుగుల్లో వంటగదిని నిర్మించుకోవాల్సి ఉంటుందన్నారు.




