
టాలీవుడ్ లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ గా రూపొందుతున్న ప్రాజెక్టుల్లో పెద్ది, పారడైస్ సినిమాలు కూడా ఇన్నాయి. రామ్ చర్- బుచ్చి బాబు సనా కాంబినేషన్ లో పెద్ది, నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ప్యారడైజ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అటు రామ్ చరణ్, ఇటు నాని ఇద్దరు తమ బాడీ లాంగ్వేజ్ తోపాటు అద్భుత మేకోవర్ తో అభిమానులను అలరించేందుకు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మేకర్స్ విడుదల తేదీలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2026 మార్చి 26న ప్యారడైజ్, మార్చి 27న పెద్ది సినిమాలను విడుదల చేయనున్నట్లు ఆ చిత్రాల మేకర్స స్పష్టం చేశాయి.
అయితే, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది అనుకున్న తేదీ కన్నా ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు పెద్ది సినిమాను తీసుకువచ్చేందుకు కష్టపడుతున్నామని ఇటీవల డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెలిపారు. ఇదే సమయంలో ప్యారడైజ్ మూవీ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతన్నాయి. ఈ క్రమంలో రూమర్స్ కు ప్యారడైజ్ టీమ్ చెక్ పెట్టింది. దీపావళి పండగ సంద్భంగా కొత్త పోస్టర్ విడుదల చేస్తూ.. మార్చి 26న విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. పోస్టర్ కూడా అదిరిపోయింది. పోస్టర్లతోనే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచేస్తున్నారు. ప్యారడైజ్ పోస్టర్ తో ఒకే రోజు ఈ రెండు సినిమాలు తలపడబోతున్నట్లు స్పష్టమైంది. దీంతో వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ ప్రారంభంలో రాబోతున్న ఈ రెండు సినిమాల మధ్యే బిగ్ ఫైట్ ఉండనుంది. అయితే, విడుదలకు చాలా టైమ్ ఉండటం.. ఇంకా సగం షూటింగ్ జరగాల్సి ఉండటంతో.. ఎదో ఒక సినిమా వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్.




