
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ కనుమరుగుతున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. అయితే ఇతర పార్టీల నుంచి ఛోటా నాయకులను బిఆర్‌ఎస్‌లో చేర్పించుకుంటూ ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు తాపత్రయపడుతున్నారని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బిఆర్‌ఎస్ నుంచి అనేక మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో వారు చేరుతున్నారని ఆయన చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్ ఓట్లన్నీ బిజెపికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పడ్డట్లు ఇప్పుడు కూడా పడేలా చేస్తున్నారని ఆయన విమర్శించారు.




