
అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ మరోసారివైమానిక దాడులకు పాల్పడింది. అఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉన్న పాక్టికా ప్రావిన్స్‌లో దాడులకు తెగబడింది. దీంతో పది మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నారని అఫ్ఘాన్ స్థాన్ క్రికెట్ బోర్డు (ఎసిబి) పేర్కొంది. దీంతో నవంబర్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లతో తలబడబోయే ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. మృతి చెందిన క్రికెటర్లకు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘పాక్ వైమానిక దాడిలో పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ జిల్లాకు చెందిన క్రికెటర్లు మృతి చెందారని, దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు చనిపోగా.. అందులో ముగ్గురు క్రికెటర్లు ఉన్నారని. ఫ్రెండ్లీమ్యాచ్ ఆడేందుకు పాక్టికా ప్రావిన్స్ రాజధాని శరణకు వెళ్లిన ముగ్గురు క్రికెటర్లు కబీర్ అఘా, సిబ్గుతుల్లా, హరూర్ తిరిగి సొంత ప్రాంతానికి వస్తుండగా ఈ దాడిలో మృతి చెందారు’ అని తెలిపింది. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ దాడికినిరసనగా వచ్చే నెలలో జరుగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి వైదొలగాలని నిర్ణయించాం’ అని స్పష్టం చేసింది.




