Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedవార ఫలాలు (19-10-2025 నుండి 25-10-2025 వరకు)

వార ఫలాలు (19-10-2025 నుండి 25-10-2025 వరకు)

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. బంధు వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ పరంగా సాధారణంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనిలో నిరాశ నిస్పృహ ఏర్పడుతుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి. వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. పాత బాకీలు వసూలు అవుతాయి.ఉద్యోగాలలోఆకస్మిక స్థానచలన సూచనలున్నవి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. స్తిరస్థుల క్రయవిక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం వలన భవిష్యత్తు బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి.

ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు.

వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వివాహంకోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. కష్టేఫలి అన్నట్లుగా ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. గణపతి స్వామి వారికి ప్రతిరోజు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటాబయ అనుకూల వాతావరణం ఉంటుంది. పదిమందిలో గుర్తింపు సాధిస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వారికి మీ విజయంతో సమాధానం చెబుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ.

మిధున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా ఆర్థికపరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికి నచ్చుతాయి. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. కాలభైరవ రూపుని మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసే వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా భూ సంబంధిత విషయాలు, మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాలు సక్రమంగా పూర్తవుతాయి. మధ్యలో ఆగిపోయిన కార్యక్రమాలను కూడా తిరిగి పునః ప్రారంభించండి కచ్చితంగా విజయవంతం అవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వారికి హోటల్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. భూమికి సంబంధించి క్రయవిక్రయాలు విజయవంతమవుతాయి. ఉద్యోగరీత్యా కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తవారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకు వెళ్లే వాళ్లకు చక్కగా అనుకూలమైన కాలం ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి మంచి క్యాంపస్ లో సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే స్కాలర్షిప్ లు కూడా వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మీరు చేసే ప్రతి పనిలో మంచి గుర్తింపు ఉంటుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి చాలా మంచిది అదేవిధంగా కాలభైరవ రూపు మెడలో ధరించండి. రుద్ర పాశుపత హోమం చేయించండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు ఎల్లో.

సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు శుభకార్యాలు చాలా చక్కగా చేయగలుగుతారు. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. భార్య భర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. సంతానం కోసం ప్రయత్నించే వారు ఒక శుభవార్త వింటారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం చాలా అనుకూలంగా ఉంది. ఎవరికైనా షూరిటీ పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. కూరగాయల వ్యాపారస్తులకు హోటల్ బిజినెస్ వారికి సినీ కళా రంగానికి చెందిన వారికి అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేసే వారు కొంత జాగ్రత్త వహించండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. స్నేహితులతో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు పనికిరావు. భూ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చాలా జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపరాధన చేయండి అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసివచ్చే రంగు తెలుపు.

కన్య రాశి వారికి ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా చాలా చక్కగా ఉంది మీరు చేసే ప్రతి పనిలో సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు ఏర్పడతాయి జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. ఉద్యోగరిత్యా వ్యాపారరిత్యా చాలా నెమ్మదిగా సాగుతుంది రావలసిన బెనిఫిట్స్ నెమ్మదిగా వస్తాయి. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేసే వారికి చక్కగా ఉంది. వ్యాపారాలలో భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వివాహ విషయంలో కాస్త ఆలస్య మైనప్పటికీ మంచి సంబంధం కుదురుతుంది సంతాన పరంగా అభివృద్ధి బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చాలా అనుకూలిస్తాయి. ముఖ్యంగా మీకు పూర్వీకుల నుండి రావాల్సిన స్థిరాస్తులు మీకు వస్తాయి. విదేశాలలో చదువుకునే వారికి అనుకూలంగా ఉంది. అలాగే పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారు ప్రయత్నం ప్రారంభించండి ఇంట్లో తల్లి యొక్క సలహాలు తీసుకోండి మీకు కలిసి వస్తాయి. ఈరాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. స్త్రీలకు కోర్టు సంబంధిత విషయాలు కాస్త ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ఈ రాశి వారు భూమి మీద కానీ బంగారం మీద కానీ పెట్టుబడి పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. వడ్డీ వ్యాపారాల జోలికి వెళ్ళకండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి మంచిది. అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి ఆరోగ్యరీత్యా మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు గ్రీన్.

తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఈ రాశి వారికి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఎంత కష్టపడితే అంతకు మించిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు భూమి అమ్మడం కంటే హౌసింగ్ లోన్స్ కు వెళ్ళటం మంచిది. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో చిన్నచిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి. ఏదైనా ఒకనిర్ణయం తీసుకునేటప్పుడు స్థిరమైన నిర్ణయం తీసుకోండి అదే నిర్ణయానికి కట్టుబడి ఉండండి మీకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ముఖ్యంగా ప్రేమవివాహ ప్రయత్నాలు చేసేవారు జాగ్రత్త వహించాలి తొందరపాటు నిర్ణయాలు సరికావు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్పా, చేయకుండా ఉండటం మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ఎప్పటినుంచో మీరు కంటున్న కల నెరవేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సినీ కళా రంగాల వారికి బ్యూటీషియన్స్ కి, రాజకీయ రంగంలోని వారికి కాలం అనుకూలంగా ఉంది. ఎన్నడు లేని విధంగా చేసే పనిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీలో ఉన్న పట్టుదలనే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి పరంగా, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంత వ్యాపారస్తులకు చాలా బాగుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభించడం కంటే ఉన్న ప్రాజెక్టులను సక్రమంగా పూర్తి చేసుకోవడం లేదా వాటినే కంటిన్యూ చేయడం మంచిది. చర్మ వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్త వహించండి. ఆహార నియమాలు పాటించండి. ఈ రాశి వారు తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి అలాగే మొగలిపువ్వు కుంకుమతో అమ్మ వారిని పూజించడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసి వచ్చే రంగు బ్లూ.

వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార రిత్యా మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి ఫలితం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చాలాచక్కగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఇది సరైన సమయం. సంతానం పట్ల వారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అంతా అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలను వెంటనే సద్వినియోగం చేసుకోండి. వ్యాపార అభివృద్ధి కూడా చాలా చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు మీకు మేలు చేస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి చార్టెడ్ అకౌంటెంట్ వారికి సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వారికి అనుకూలంగా ఉంది. సిని కళా రంగం వారికి టెక్నీషియన్స్ కి బ్యూటీషియన్స్ కి కూడా అనుకూలంగా ఉంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి మంచిది. అలాగే ఓం నమశ్శివాయ పంచాక్షరి మంత్రం చదవడం కూడా మంచిది, దీనిని 41 రోజులు చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది, కలిసి వచ్చే రంగు ఎరుపు.

ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎప్పటినుండో వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మీకున్న చిన్నచిన్న ఇబ్బందులు తొలగి పోతాయి. భూ సంబంధిత విషయాలు మీకు కలిసి వస్తాయి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది దానివల్ల కొన్నిపనులు నిదానంగా నడిచినప్పటికీ చివరకు సక్రమంగా పూర్తవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చాలా అనుకూలంగా ఉంది. స్నేహితుల విషయంలో వారి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ఏ పని చేసినా నలుగురి సలహాలు తీసుకోండి ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి. విద్యారంగం వారికి వైద్యరంగం వారికి మంచి కాలం. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి ల్యాబ్ టెక్నీషియన్స్ కి చిరు వ్యాపారస్తులకు ఆదాయాలు తక్కువగా ఉన్న పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉంటాయి. పెద్దగా నష్టం కూడా ఉండదు. ఈ రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి అలాగే శనికి తైలాభిషేకం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.

మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు కాలం చాలా అనుకూలంగా ఉంది. గడచిన వారాల కంటే ఈ వారం చాలా చక్కగా ఉంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యాపార అభివృద్ధి చాలా చక్కగా ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చక్కగా ఉంది. అలాగే బ్యూటీషియన్స్ కి సినీకళా రంగాల వారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ వారికి కాలం అనుకూలంగా ఉంది. మీకున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు గడచిన కాలం కంటే కూడా అనుకూలంగా ఉంది, ముఖ్యంగా వీరికి విదేశీ పర్యటన చాలా అనుకూలిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కలిసి వస్తుంది. బంధు వర్గంతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి పక్కవారి విమర్శలను పట్టించుకోకండి. స్వయంకృషితో మీరు చేపట్టిన ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపరాధన చేయటం కాలభైరవ రూపు మెడలో ధరించడం మంచిది. ఈ రాశి వారికి నరదృష్టి అధికంగా ఉంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

కుంభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య రిత్యా ఉన్న కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఆరోగ్యపరంగా కొంతమంది విషయంలో సర్జరీ తప్పకపోవచ్చు వాటి విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం మంచిది. ఈ రాశి వారికి కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఒక రూపాయి సంపాదన ఉంటే పది రూపాయలు ఖర్చు ఉంటుంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. వీలైతే గో-దానం చేయండి లేదా గోవుకు ఉలవలు కానీ ఏదైనా ఆహారం కాని తినిపించండి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంతాన సంబంధిత విషయాలు చాలా చక్కగా ఉన్నాయి, విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈవారం వ్యాపారంలో లాభాలు చాలా చక్కగా ఉంటాయి, భాగస్వాముల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండటం జరుగుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉంటారు. మీరు మానసికంగా చాలా మార్పు చెందుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. కోర్టు కేసులు కొంత ఇబ్బంది పెడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ప్రతిరోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయటం, అఘోర పాశుపత హోమం చేయించడం, శనికి తైలాభిషేకం చేయించడం జపం చేయించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.

మీన రాశి వారికి ఈవారం కాలం అంతా అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా లోతుగా ఆలోచించి తీసుకోవడం మంచిది ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. అప్పు చేసే విషయంలో జాగ్రత్త వహించండి. కోర్టు సంబంధిత విషయ వ్యవహారాలు మీకు సానుకూల పడతాయి. ఎప్పటి నుండో కలగంటున్నఒక కొత్త ప్రాజెక్టును మీరు ప్రారంభిస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం చేస్తే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నంలో ఫలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగానికి గడ్డుకాలం అని చెప్పవచ్చు. భూ సంబంధిత క్రయవిక్రయాల విషయాలలో జాగ్రత్త వహించండి. కొన్ని శుభకార్యాలు చేస్తారు. వివాహం కానివారికి వివాహ ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్నేహితులతో కొంత జాగ్రత్త వహించండి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. స్నేహితులకు అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. మీరు ఏ పని చేసినా ఇంట్లో వారికి చెప్పకుండా చేయకండి. మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి. ప్రేమ సంబంధిత వ్యవహారాలలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అది ఆడవారైనా మగవారైనా ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఏదైనా ఉంటే ఇంట్లో వారి సహాయ సలహాలు తీసుకోండి. మీకు సొంత నిర్ణయాలు కలిసి రావు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్నచిన్న అడ్డంకులు ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి కోర్టు సంబంధిత విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి కానీ సరైన నిర్ణయం తీసుకొని ధైర్యంతో ముందుకు వెళ్ళటం మంచిది. మీ మొండి పట్టుదలను పక్కనపెట్టి సామరస్యంగా ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. నలుగురులో కలిసి ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా లేవు. మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించడం మంచిది. ఈ రాశి వారు ప్రతి రోజు శని గ్రహ స్తోత్రం పఠించండి, శనికి అష్ట మూలికా తైలంతో అభిషేకం చేయించడం మంచిది. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments