
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మరోమారు అఫ్గానిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై శనివారం వైమానిక దాడులకు దిగింది. ఈ భీకర దాడులలో పలువురు ఉగ్రవాదులు, పౌరులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు యువ క్రికెటర్లు కూ డా ఉన్నారని ది డాన్ పత్రిక తెలిపింది. ఇప్పుడు పాక్, అఫ్గాన్ సేనల మధ్య డోలాయమాన స్థితిలో ఉన్న కాల్పుల విరమణ ఇప్పటి ఈ దాడుల ఘటనతో చతికిలపడింది. పైగా దోహాలో జరగాల్సిన ఇరుపక్షాల శాంతి చర్చలపై నీలినీడలు పర్చుకున్నాయి. తహరీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి) బహదూర్ వర్గం పాక్ అఫ్గాన్ సరిహద్దుల్లో ప్రా బల్యం చాటుకునేందుకు యత్నించడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక్కరోజు క్రితమే నార్త్ వజరిస్థాన్‌లోని పాక్ సైనిక కేంద్రంపై ఉగ్రవాదులు కాల్పులు, బాంబుల దాడికి దిగారు.
తాలిబన్ల ఉగ్రసంస్థ దాడికి ప్రతీకారంగా పాక్ సేనలు శనివారం అఫ్గాన్ మారుమూ ల ప్రాంతంలోని ఉర్గన్, బర్మాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాలపై వైమానిక దా డులకు దిగాయి. అక్కడ ఉగ్రవాద స్థావరాలను లక్షాలుగా ఎంచుకున్నాయి. ఈ దాడులలో క్రికెటర్లు మృతి చెందారని పత్రిక తెలిపింది. క్రికెటర్ల మృతిని అఫ్గాన్‌స్థాన్ క్రికెట్ బోర్డు నిర్థారించింది. ముగ్గురు యువ ఆటగాళ్లు కబీర్, సిబ్ఘహతుల్లా, హరూన్‌లు చనిపోయారని ఈ క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో తెలిపింది. క్రికెటర్ల మృతికి నిరసనగా తాము మూడు దేశాల టి 201 సీరిస్ క్రికెట్ పోటీని బహిష్కరిస్తున్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ పోటీలో పాక్ క్రికెట్ జట్టు ప్రధాన పక్షంగా ఉంది నవంబర్ చివరిలో ఈ క్రికెట్ జరగాల్సి ఉంది. జరిగ. ఇప్పటి దాడులతో దోహాలో జరిగే శాంతిచర్చలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని , యధావిధిగా జరుగుతాయని పాక్ తరఫున విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్, తాబిబన్లతో చర్చలు జరుపుతారని ప్రకటన వెలువడింది.




