
కర్ణాటక లోని కార్వర్‌కు చెందిన మత్సకారుడు అక్షయ్ అనిల్ మజలికర్ (24) అక్టోబర్ 14న సముద్రంలో బోటు అంచున ఉండగా, నీళ్లలో నుంచి ఎగిరి వచ్చిన ఒక చేప అతని కడుపులో పొడిచింది. ఈ చేప నోరు 10 అంగుళాల పొడవుతో మొన తేలి ఉండడంతో మత్సకారునికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం జరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత మృతి చెందాడు. ఆ చేప కందెరకమని చెబుతున్నారు. అనిల్ మృతికి వైద్యుల నిర్లక్షమే కారణమని అతని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.




