
ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి క్షేత్రంలో స్వామివారికి లక్ష పుష్పార్చన పూజ మహోత్సవాన్ని శాస్త్రోక్త్తంగా వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు , అర్చక బృందం లక్ష పుష్పార్చన పూజ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ పుష్పాలతో స్వామివారిని అర్చిస్తూ నిర్వహించిన పూజను భక్తులు సేవించి దర్శించుకున్నారు.
అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం …
యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీ ఆండాలమ్మకు అత్యంత ప్రీతికరమైన శుక్రవారం రోజు కావడంతో శాస్త్రక్తంగా ఊంజల్ సేవా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సాయంత్రం అమ్మవారిని ప్రత్యేక అలంకరణ గావించి ఆలయ అర్చకులు వేద పండితులు వేదమంత్రాలు ఉచ్చరిస్తుండగా మేళతాళాల మధ్య ఆలయ తిరువేదులలో ఊరేగించారు. ఆలయ ప్రకారం లోపల అద్దాల మండపంలో అమ్మవారిని కొలువు తెచ్చి ఊంజల్ సేవ మహోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు. సేవా మహోత్సవంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి దీపారాధనతో దర్శించుకున్నారు.
శ్రీవారి నిత్యారాబడి….




