
ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్‌ఎం ప్రధాన పాత్రల్లో ‘జాతి రత్నాలు’ ఫేమ్ కె.వి.అనుదీప్ స్నేహితుడు విజ యేందర్ దర్శకత్వంలో తెరకె క్కిన చిత్రం ‘మిత్ర మండలి’. బీవీ వర్క్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా.విజేందర్ రెడ్డి తీగల నిర్మిం చిన ఈ చిత్రంలో బ్రహ్మా నందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం దీపా వళి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందు కుందో చూద్దాం.
కథ:
జంగిలిపట్నం అనే ఊరులో ఎన్నికలు రావడంతో ఎమ్మెల్యే టికెట్ కోసం తుట్టె అనే కులానికి నాయకుడైన నారాయణ (వీటీవీ గణేష్).. ఫ్రీడమ్ రాజు (సత్య ప్రకాష్) మధ్య పోటీ నెలకొంటుంది. అదే ఊరిలో చైతన్య (ప్రియదర్శి).. సాత్విక్ (విష్ణు ఓయ్).. అభి (రాగ్ మయూర్).. రాజీవ్ (ప్రసాద్ బెహరా) అనే నలుగురు స్నేహితులు పనీ పాటా లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. అయితే నారాయణ తన కూతురు లేచిపోయిందంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చి తన కోసం వెతకమంటాడు. మరి స్వేచ్ఛ ఎక్కడికి వెళ్లింది.. ఎవరితో ప్రేమలో పడింది… తన వల్ల ఈ నలుగురు స్నేహితులు పడ్డ ఇబ్బందులేంటి.. ఆమె తిరిగొచ్చిందా లేదా.. ఈ విషయాలన్నీ తెరపై చూడాల్సిందే.
కథనం, విశ్లేషణ:
ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా ఈ సినిమాలోని సన్నివేశాలు సాగుతాయి. ఇటీవల జాతి రత్నాలు, మ్యాడ్, ఓయ్, సింగిల్, లిటిల్ హార్ట్ చిత్రాలు ఈ కోవలో వచ్చి ప్రేక్షకులను నవ్వించాయి. ‘మిత్రమండలి’లో పై సినిమాల్లో మాదిరిగా కామెడీ బాగానే వర్కవుట్ అయింది. ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది ఈ సినిమా. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. ఎస్‌ఐగా నటించిన వెన్నెల కిషోర్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు. వీటీ గణేశ్ హాస్యంతో ఆకట్టుకున్నాడు. ‘మిత్రమండలి’ కథలో హీరోయిన్ పాత్ర కీలకం. నిహారిక ఎన్‌ఎం ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించింది. బ్రహ్మానందం ఓ పాటలో మెరిసి అలరించాడు. సంగీత దర్శకుడు ఆర్‌ఆర్ ధ్రువన్.. ఈ కథకు తగ్గట్లుగా ఎక్కువగా రీమిక్స్, పేరడీ పాటలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాడు. సినిమా విజువల్స్ కలర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. మొత్తానికి ‘మిత్ర మండలి’ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది.




