
బ్లాక్ మెయిల్ రాజకీయాల కు తాను లొంగనని, తప్పుడు వార్తలు, ఆరోపణలపై స్పం దించాల్సిన అవసరం లేదని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తన మేనల్లు డు సతీశ్ రావు కనపర్తి ఆర్గానిక్ చైన్ స్టోర్స్ విషయంలో వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. కుట్రపూరిత ఆరోపణల వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పుఒప్పులు అందరి దగ్గర జరుగుతాయన్నారు. ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుంటానని ఆయన తెలిపారు. లిక్కర్ టెండర్లు చివరి మూడు రోజుల్లో భారీ సంఖ్యలో వస్తాయ ని గతేడాది చివరి మూడు రోజుల్లో 96 వేల దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.
ఆర్గానిక్ చైన్ స్టోర్స్ పేరుతో వ్యాపారం
అమెరికాలో ఉండే మంత్రి జూపల్లి కృష్ణారావు మేనల్లుడు సతీశ్ రావు కనపర్తి తన మేనమామ మంత్రి జూపల్లి కావటంతో ఆయన ఇండియాకు వచ్చి ఆర్గానిక్ చైన్ స్టోర్స్ పే రుతో వ్యాపారం మొదలు పెట్టారని, అందులో భాగంగా హైదరాబాద్‌లో 4 స్టోర్లు ప్రారంభించిన సతీశ్ రావు నేచురల్‌గా పండిన వ్యవసాయ ఉత్పత్తులు అందించి ఆరో గ్యం కాపాడుతానని ప్రజలను నమ్మించి వారి వద్ద కోట్లు వసూలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన్ను నమ్మి అనేక మంది సీనియర్ సిటిజన్లు పెట్టబడులు పెట్టా రు. కొంతకాలం వారికి నెల నెల వడ్డీలు కడుతూ వారిలో నమ్మకం కలిగించిన సతీశ్ కోట్లాది రుపాయలు వసూలు చేశారని అనంతరం ఆ సొమ్ముతో అమెరికా పారిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమ డబ్బులేవని అడిగినందుకు సతీశ్ రావు తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తుండడంతో ఈ అంశంపై మంత్రి జూపల్లి స్పందించారు.




