
రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి జోథ్‌పూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను స్థానిక జవహర్‌ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశా యి. జైసల్మేర్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేట్ బస్సు జోథ్‌పూర్ బయలుదేరింది. జైసల్మేర్‌కు 20కిమీ దూరంలో థాయత్ గ్రామ సమీపంలో బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే బస్సంతా వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఫైర్ సిబ్బందికి తెలియజేశారు.
బాధితులకు సహాయ చ ర్యలు చేపట్టారు. బస్సులో మొత్తం 57మంది ప్రయాణికులు ఉన్నారు. మృ తుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు, ఉన్నారని జైసల్మేర్ మున్సిపల్ కౌన్సిల్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ క్రిష్ణపాల్ సింగ్ రథోర్ వెల్లడించారు. బస్సులో ఉన్న వారిలో కొందరు కిటికీలు పగుల గొట్టి బయటపడ్డారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బస్సు ఇంజిన్ లేదా వైరింగ్ షార్టు సర్కూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. రాజస్థాన్ సిఎం భజన్‌లాల్ శర్మ మృతుల కుటుంబాలకు సంతాపం వెలిబుచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.




