Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedమంగళవారం రాశి ఫలాలు (14-10-2025)

మంగళవారం రాశి ఫలాలు (14-10-2025)

మేషం- వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యధాతధంగా ఉంటాయి. ఎంతో శ్రమించి ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ వృత్తి వ్యాపారాలలో సాధారణ ఫలితాలు లభిస్తాయి.

వృషభం- మీ నుండి ఉపకారం పొందిన వారి నుండే తిరిగి మీరు సహాయమును పొందవలసి వస్తుంది. కుటుంబ పురోగతి బాగుంటుంది. విద్యా సాంస్కృతిక కార్యక్రమాల కొరకు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మిథునం- జమా ఖర్చులకు సంబంధించిన వాటిలోని ఒడిదుడుకులు గుర్తించి మౌనంగా కార్యాచరణలో మార్పులు చేస్తారు. ఆర్థికపరమైన అంశాలు కొంతమేర ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం – వృత్తి ఉద్యోగాలలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. మీకు న్యాయం చేయవలసిన వాళ్ళు సంపూర్ణంగా న్యాయం చేయరు స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు ఓ పరిష్కార దిశకు చేరుకుంటాయి.

సింహం – ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం దక్కదు. కళా, సాంస్కృతిక రంగాల్లోని వారికి పోటీ ఎదురవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.

కన్య- చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. శుభకార్యాల నిర్వహణకు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది.

తుల: మీలో నిద్రాణమైన ప్రతిభ వెలుగు చూస్తుంది. హోదాను పెంచే విధంగా ఒక ఒప్పందాన్ని చేసుకుంటారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం: శారీరక మానసిక శ్రమ అధికమవుతుంది. సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.

ధనస్సు: చాకచక్యంగా వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు.

మకరం: పనివారు, సహ ఉద్యోగులు కొన్ని చికాకులు కల్పించిన వాటిని అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. బందు వర్గానికి ధన సహాయం చేయవలసి వస్తుంది.

కుంభం: కొన్ని చర్చలు జరిపి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్టేషనరీ ప్రింటింగ్ సంబంధిత వ్యాపారాలు కొంతమేర అనుకూలంగా ఉంటాయి.

మీనం: ప్రతి పని రెండోసారి సానుకూలపడుతుంది. స్వల్పకాలిక ట్రాన్సాక్షన్స్ లాభిస్తాయి. మిత్రులతోటి సుదీర్ఘమైన సంభాషణ సాగిస్తారు. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ పనులు సానుకూలపడతాయి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments