
మేషం – పనులలో కొంత నిదానం ఉంటుంది. సన్నిహితులతో మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించాలి. సభ్యుల ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోగలుగుతారు.
వృషభం – వృత్తి ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో పనిచేస్తారు.కొంత ఒత్తిడికి గురైనప్పటికీ అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయం కొంత నిరాశకు గురిచేస్తుంది.
మిథునం – వృత్తి- ఉద్యోగాలపరంగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు కొంత చికాకు కలిగిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు తగదు.
కర్కాటకం – వృత్తి ఉద్యోగాలలో కొంత మార్పు కోరుకుంటారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ ఓర్పు సహనం వహించడం చెప్పదగినది.
సింహం – సంతానం చేపట్టిన పనులలో విజయం సాధించడం మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. ప్రత్యర్థి వర్గం వారి చేష్టలు సూటిపోటి మాటలు మీకు విసుగు కలిగిస్తాయి.
కన్య – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అయినవారి అండదండలు మీకు లభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. స్పెక్యులేషన్ కు దూరంగా ఉండటం మంచిది.
తుల – ప్రధానమైన కార్యక్రమాలను నిర్వహించడానికి కావలసిన ధనమును వ్యయ ప్రయాలకోర్చి సమకూర్చుకోగలుగుతారు. పదే పదే పదుగురి సలహాలు తీసుకుంటారు కానీ మీకు తోచినదే చేస్తారు.
వృశ్చికం – జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. సంతాన క్షేమం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వృత్తి ఉద్యోగములకు అవసరమైన ఆధునిక సామాగ్రిని ఏర్పరచుకుంటారు.
ధనుస్సు – ఎంత శాంతంగా ఉన్నా ఓర్పు సహనాలకు అగ్నిపరీక్ష పెట్టే రీతిలో శత్రువర్గం మిమ్మల్ని రెచ్చగొడతారు. మీ నిర్లక్ష్యం వలన కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొనవలసి వస్తుంది.
మకరం – ఒకే సమయంలో అనేక అంశాలను సానుకూల పరుచుకోవాల్సి రావడం వలన మానసికంగా శారీరకంగా ఒత్తిడికి లోనవుతారు. పరపతిని ఉపయోగించి అతి ముఖ్యమని భావించిన వ్యవహారాలను సానుకూల పరుచుకోగలుగుతారు.
కుంభం – మీ పరిధిలో లేని అంశాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగములలో నైపుణ్యమును ఆసక్తిని చూపిస్తారు. సహచరులలో ఒకరు మీ సన్నిహితులు అవుతారు.
మీనం – ఏ పని నైనా సరే పూర్తికానంతవరకు బహిర్గతం చేయకండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. లీజులు లైసెన్సులను తిరిగి పొందడానికి గాను చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి.




