
మదురై నుంచి 76 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం శనివారం చెన్నైలో ల్యాండ్ కాకముందే దాని పైలట్ విండ్ షీల్డ్‌లో(అద్దంలో) పగుళ్లు కనిపించాయని అధికారులు తెలిపారు. ఇది గమనించిన పైలట్ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలో తగు ఏర్పాట్లు చేశారు. విమానం చివరికి సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాన్ని పార్కింగ్ కోసం ప్రత్యేక బే (బే నంబర్ 95)కి తీసుకెళ్లి, తర్వాత ప్రయాణికులను సురక్షితంగా దింపామని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఆ అద్ధాన్ని మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సంఘటనకు కారణమేమిటన్నది ఇంకా తెలియలేదు. కాగా విమానం తిరుగు ప్రయాణం మదురైకి రద్దుచేశారు. ఇదిలావుండగా దీనిపై ఇండిగో విమాన సంస్థ ఇంకా స్పందించలేదు.




