
మధ్య ప్రదేశ్‌లో మాట్లాడితే హైదరాబాద్‌లో పోలీసు కేసు పెడతారా? అని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాష్ట్ర డిజిపిని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డికి లేఖ రాశారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో తాను మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడానంటూ పోలీసులు కేసు పెట్టారని ఆయన తెలిపారు. పోలీసు చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు.




