
’బబుల్ గమ్’ తో సక్సెస్‌ని అందుకున్న హీరో రోషన్ కనకాల ’మోగ్లీ 2025’తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు సందీప్ రాజ్ (కలర్ ఫోటో) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫారెస్ట్ నేపథ్యంలో సాగే యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ’మోగ్లీ 2025’ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. శనివారం నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ’మోగ్లీ 2025’ డిసెంబర్ 12న థియేటర్లలోకి వస్తుందని తెలియజేశారు.




