వైసిపి ఎంపి మిథున్ రెడ్డికి ఎపిలో విజయవాడలోని ఎసిబి ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది. పాస్ పోర్ట్ ఇచ్చేందుకు అనుమతి ఇస్తూ ఎసిబి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.. సంచలనంగా మారిన ఎపి లిక్కర్ స్కామ్ కేసులో ఎ-4గా ఉన్న ఎంపి మిథున్‌రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో తన పాస్ పోర్ట్ ను కోర్టులో మిథున్ రెడ్డి సమర్పించారు. అయితే, యూఎస్ వెళ్లేందుకు తన పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఎసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక, మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లే సమయంలో అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో వెల్లడించింది. అయితే, న్యూయా ర్క్‌లో జరగబోయే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు పీఎంవో నుంచి ఎంపి మిథున్ రెడ్డి ఎంపికయ్యారు.
ఈ నెల 27వ తేదీన నుంచి 31వ తేదీ వరకు న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో సిట్ సీజ్ చేసిన పాస్ పోర్ట్ రిలీజ్ చేయాలంటూ ఎసిబి కోర్టును మిథున్ రెడ్డి ఆశ్రయించిన విషయం విదితమే. ఇక, ఎపిలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎ-4గా ఎంపీ మిథున్‌రెడ్డి ఉన్నారు. అయితే, సుమారు 71 రోజుల పాటు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి సెప్టెంబర్ 29న ఎసిబి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఎంపి మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను ఎసిబి కోర్టు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ. 2 లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, వారంలో రెండుసార్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయాలని పేర్కొన్న విషయం తెలిసిందే.