ఆర్‌టిసిలో డ్రైవర్లు, శ్రామిక్‌ల నియామకాలకు అక్టోబర్ 8, నుండి అక్టోబర్ 28, సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో స్వీకరించనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 17న నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. చట్ట ప్రకారం నిర్దేశిత కొత్త ఫార్మెట్‌లో ఎస్‌సి కుల ధృవీకరణ ప్రత్రాల జారీ కోసం ఎస్‌సి అభివృద్ధి శాఖ కమిషనర్ ఇదివరకే జిల్లా కలెక్టర్‌లకు సూచనలు చేశారు. ఎస్‌సి కమ్యూనిటీ అభ్యర్థులు తమ కమ్యూనిటీ సర్టిఫికెట్లను కొత్త నిర్దేశిత ఫార్మాట్‌లో తహశీల్దార్లు /మీ సేవా కేంద్రాల నుండి పొందాలని, ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు అప్‌లోడ్ చేయాలని సూచించారు.
అభ్యర్థులు సకాలంలో కొత్త సర్టిఫికెట్‌ను పొందలేకపోతే, ఆలస్యాన్ని నివారించడానికి వారు కుల పేరును స్పష్టంగా పేర్కొంటూ సంబంధత అధికారులు జారీ చేసిన అందుబాటులో ఉన్న ఎస్‌సి కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. అటువంటి అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో నిర్దిష్ట గ్రూప్ అంటే గ్రూప్ 1-, గ్రూప్ -II , గ్రూప్ -III ఉప-వర్గీకరణతో కొత్త ప్రొఫార్మాలో ఎస్‌సి కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. – అలా చేయకపోతే, అటువంటి అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని ఎస్‌సి కేటగిరీ కింద పరిగణించరని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాస్ రావు తెలిపారు.