Thursday, October 9, 2025
Google search engine
HomeUncategorizedప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

 కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్ల బైపాస్ రహదారిపై సోమవారం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాల య్యాయి. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఈ బస్సు వెళ్తోంది. బస్సు బోల్తాపడిన చోట ఇటీవల వర్షాలకు రహదారి కోతకు గురైంది. దాంతో రోడ్డు పక్కన ఓ కుంటలో బోల్తా పడింది. ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments