Thursday, October 9, 2025
Google search engine
HomeUncategorizedనాగ్ అశ్విన్: ఆలియాకు షాక్.. సాయి పల్లవితో చర్చలు..

నాగ్ అశ్విన్: ఆలియాకు షాక్.. సాయి పల్లవితో చర్చలు..

దర్శకుడిగా చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల మెప్పు పొందాడు నాగ్ అశ్విన్. ‘కల్కి -2898ఎడి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపుకున్నాడు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బాస్టర్ కావడంతో పాటు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్‌ ప్రారంభించడానికి ముందు నాగ్ అశ్విన్ ఒక లేడి ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కిస్తున్నాడని సమాచారం.

ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటికే ఈ సినిమా కథను బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌కు నాగ్ అశ్విన్ వినిపించగా.. ఆమె ఒకె చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి ఆలియా తప్పుకుందని టాక్ వినిపిస్తోంది. డేట్స్ కుదరకపోవడంతో ఆమె ఈ సినిమాను వదులుకుందట. దీంతో ఇప్పుడు ఈ కథను సాయి పల్లవికి చెప్పారట. ఆమె కూడా సినిమాకు ఒకె చెప్పినట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా పూర్తయితే.. నాగాశ్విన్ ‘కల్కి-2’ సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments