ఆస్ట్రేలియాతో త్వరలో జరగబోయే వన్డే, టి-20 సిరీస్‌ల కోసం శనివారం భారత జట్లను బిసిసిఐ ప్రకటంచింది. వన్డేల కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి అతనడి స్థానంలో శుభ్‌మాన్ గిల్2ను కూర్చొబెట్టారు. దీంతో సెలక్షన్ కిమటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రోహిత్ ఫ్యాన్స్. తాజా తీవ్ర మరో విషయంపై కూడా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌పై మండిపడుతున్నారు.
అదేంటంటే.. టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టులో చోటు కల్పించకపోవడమే. జడేజా ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయినా అతడికి వన్డే జట్టులో చోటు లభించలేదు. ఈ విషయంపై వచ్చిన ప్రశ్నకు అజిత్ అగార్కర్ సమాధానం ఇచ్చారు. ‘‘ప్రస్తుతానికి ఇద్దర ఎడమచేతి వాటం స్పిన్నర్లను తీసుకెళ్లడం సాధ్యం కాదు. జడేజా సమర్థుడే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్నాడు. ఎందుకంటే అక్కడి పరిస్థితుల కారణంగా మేము అదనపు స్పిన్నర్లను తీసుకువెళ్లాం. ఇప్పుడు మేం ఒకరికి అవకాశం ఇవ్వగలం. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లతో జట్టులో సమతుల్యతను కాపాడుకోగలం. ఆస్ట్రేలియాలో మనకు అంతకంటే ఎక్కువ అవసరం ఉంటుందని నేను అనుకోను. ఇది కేవలం మూడు మ్యాచ్‌ల చిన్న సిరీస్. అందరికి అవకాశం ఇవ్వలేము. దురదృష్టవశాత్తు ఈ సారి జడేజా మిస్అవుతున్నాడు. అంతకు మంచి ఏమీ కాదు’’ అని అగార్కర్ అన్నారు.