హైదరాబాద్: దేశంలో పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరిగిందని టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో మహేశ్‌కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. టిపిసిసిలోని ప్రతినిధులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ బిజెపికి అనుబంధ సంఘంగా పని చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ అన్ని ఆధారాలతో ఓట్ చోరీలను బయటపెట్టారని పేర్కొన్నారు. ఆధారాలు చూపించినా ఇసి నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో సంతకాల సేకరణ కార్యక్రమం ఆలస్యమైందని మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. భారీ వర్షాల దృష్ట్యా సంతకాల సేకరణ ప్రారంభించలేదని అన్నారు. ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టాలని నేతలను ఆదేశించారు. గ్రామంలో కనీసం వంద మందితో సంతకాలు చేయించాలని తెలిపారు. బిజెపి ఓట్ చోరీ ఎలా చేసిందో ప్రజలకు వివరించాని అన్నారు. ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టాలని పేర్కొన్నారు.