ఆస్ట్రేలియా పర్యటన కోసం శనివారం బిసిసిఐ సెలక్షన్ కమిటీ భారత వన్డే జట్టును ప్రకటించింది. ఇక్కడే ఓ అనూహ్యమైన విషయం జరిగింది. రోహిత్ శర్మను వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ.. ఆ బాధ్యతలను శుభ్‌మాన్ గిల్‌కి అప్పగించారు సెలక్టర్లు. దీంతో రోహిత్ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సెలక్టర్లపై విమర్శలు చేస్తున్నారు. రోహిత్ ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడని.. 2027 వన్డే ప్రపంచకప్ వరకూ అతడు ఆడగలడని పోస్ట్‌లు పెడుతున్నారు.
రోహిత్ శర్మ ది బెస్ట్ కెప్టెన్.. బిసిసిఐ అతడిని కావాలనే తప్పించిందని ఓ అభిమాని ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఎనిమిది నెలల వ్యవధిలోనే రెండు ఐసిసి ట్రోఫీలు అందించిన కెప్టెన్‌ను ఇలా అవమానిస్తారా అని మరో వ్యక్తి మండిపడ్డాడు. మరికొందరు టీం ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శకం ముగిసిందని.. ఇంతకాలం కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన రోహిత్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రస్తుతానికి సోషల్‌మీడియాలో రోహిత్ శర్మ పేరు వైరల్ అవుతోంది.
ఇక కెప్టెన్‌గా రోహిత్ భారత్‌కు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. రెండు ఐసిసి టైటిల్స్ పోరులో కూడా జట్టును గెలిపించాడు. 2024 టి-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జట్టును ముందుండి నడిపించి టైటిల్‌ని అందించాడు. రోహిత్ కెప్టెన్సీలో టీం ఇండియా ఓవరాల్‌గా 56 వన్డే మ్యాచులు ఆడగా.. 42 మ్యాచుల్లో విజయం సాధించింది. 12 మ్యాచులు ఓడిపోయింది. 1 ఫలితం తేలలేదు, ఒకటి డ్రాగా ముగిసింది. దీంతో కెప్టెన్‌గా రోహిత్ విజయశాతం 76గా ఉంది.