అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దంచికొట్టాడు. విండీస్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు చేశాడు.176 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 104 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో జడేజా ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అంతేకాక.. టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును దాటేశాడు. టెస్ట్ మ్యాచుల్లో సిక్సుల విషయంలో జడేజా ధోనీని అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లో జడేజా 5 సిక్సులు కొట్టాడు. దీంతో తన టెస్ట్ కెరీర్‌లో 80 సిక్సుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో ధోనీ (78 సిక్సులు)ని దాటేశాడు. ఇక జడేజా కంటే ముందు స్థానాల్లో రోహిత్ శర్మ (88), రిషబ్ పంత్ (90), వీరేంద్ర సెహ్వాగ్(91)లు మాత్రమే ఉన్నారు. వీరిలో ప్రస్తుతానికి రిషబ్ పంత్ ఒక్కడే టెస్టుల్లో కొనసాగుతున్నాడు.