Thursday, October 9, 2025
Google search engine
HomeUncategorizedవిండీస్‌తో టెస్ట్.. ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా

విండీస్‌తో టెస్ట్.. ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా

అహ్మదాబాద్: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ని 162 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా పేసర్లు మహ్మద్ సిరాజ్ 4, బుమ్రా 3 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాషించారు. అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో అత్యంత వేగంగా 50 టెస్ట్ వికెట్లు తీసిన భారత ఫాస్ట్‌ బౌలర్‌గా జవగల్ శ్రీనాథ్ రికార్డును సమం చేశాడు.

బుమ్రా, శ్రీనాథ్ తలో 24 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో (25), ఇషాంత్ శర్మ (27), మహ్మద్ షమీ (27) ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక మ్యాచ్‌లో వెస్టిండీస్ 162 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ బ్యాటింగ్‌లో గ్రీవ్స్‌దే 32 అత్యధిక స్కోర్. ప్రస్తుతం భారత్ 34 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్ (50), గిల్ (14) ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments