
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్ డ్రామా పెద్ది. బుచ్చి బాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రం బిగ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. తాజాగా విడుదలైన స్టిల్‌లో రామ్ చరణ్ బీస్ట్ మోడ్‌లో కనిపించడం అదిరిపోయింది. పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి ఐదు భాషలలో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రామ్ చరణ్ వైరల్ డ్యాన్స్‌తో ఈ సాంగ్ గ్లోబల్ మూమెంట్‌గా మారింది. త్వరలోనే మరో పాటని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ గర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్. మార్చి 27న పెద్ది గ్రాండ్ పాన్- ఇండియా థియేట్రికల్ రిలీజ్ కాబోతుందని మేకర్స్ మరోసారి ప్రకటించారు.




