
మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళా రిజర్వేషన్‌లను ప్రభుత్వం ఉత్తర్వులు ఖరారు చేసింది. సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలని మున్సిపాలిటీలతో పాటు రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లోని వార్డుల రిజర్వేషన్‌లను 2011 జనాభా ఆధారంగా ప్రభుత్వం ప్రకటించింది. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో 43 వార్డులకు, సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లోని 28 వార్డులకు, కోదాడలోని 35 వార్డులకు, నేరెడుచెర్లలోని 15, సూర్యాపేటలోని 48, తిరుమలగిరిలోని 15 వార్డులకు రిజర్వేషన్‌లను ప్రభుత్వం ప్రకటించింది. ఇక, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్‌లో 12 వార్డులకు, పరిగిలోని 18 వార్డులకు, తాండూరులోని 36, వికారాబాద్‌లోని 34 వార్డులకు ప్రకటించారు. వనపర్తి జిల్లాలోని అమరచింతలోని 10 వార్డులకు. కొత్తకోటలోని 15 వార్డులకు, పెబ్బేరులోని 12, వనపర్తిలోని 33 వార్డులకు రిజర్వేషన్‌లను ప్రకటించారు. వరంగల్‌లోని నర్సంపేట్‌కు సంబంధించి 30 వార్డులకు, వర్ధన్నపేటలోని 12 వార్డులకు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులోని 12 వార్డులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బిసిల రిజర్వేషన్‌లను 2011 జనాభా ఆధారంగా రిజర్వేషన్‌లను ఖరారు చేశారు. దీనికి సంబంధించి జిఓ ఎంఎస్ నెంబర్ 14ను పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టికె శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేసింది.




