
అమెజాన్ ఇండియా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ఈ నెల 16 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ అండ్ కిచెన్, ఎలక్ట్రానిక్స్, పెద్ద గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులపై భారీ డీల్స్ అందిస్తోంది. ప్రైమ్ సభ్యులకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్‌బిఐ కార్డులతో 10 శాతం వరకు తక్షణ రాయితీ, అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డుతో 5% క్యాష్‌బ్యాక్ ఉంది. ఎంపిక చేసిన ఫోన్లపై రూ.60 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, పండుగల ఆనందాన్ని పెంచేలా విస్తృత ఎంపికలు, ఏఐ ఆధారిత సౌకర్యాలతో వినియోగదారులకు మెరుగైన షాపింగ్ అనుభవం అందిస్తున్నామని తెలిపారు.




