
పుట్టి నెలలు కూడా గడవకముందే ఓ ఆడ పసికందును కన్నతల్లి తండ్రులే తమకు భారం అవుతుందని విక్రయించిన సంఘటన ఫరూక్‌నగ ర్ మండలం ఉప్పరిగడ్డ తండా గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. పట్టణ సీఐ విజ య్ కుమార్ కథనం ప్రకారం… లాల్ సింగ్ తండాకు చెందిన రేణుక వినోద్ 2025 నంబర్ 9న శిశువుకు జన్మనిచ్చింది. జనవరి 1 నుండి ఆ పసికందు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అంగన్వాడి టీచర్ ఐసిడిఎస్ అధికారులతోపాటు షాద్ నగర్ పోలీసుల కు ఫిర్యాదు చేసింది. గోవింద్ అనే మధ్య వ్యక్తి ద్వారా మరొకరికి పసికందును అమ్మివేసినట్లు గుర్తించిన పోలీసులు పసికందు తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తిత్వం వహించిన గోవింద్ అనే వ్యక్తిపై చైల్డ్ ట్రాకింగ్ సెక్షన్‌తోపాటు 143 బిఎన్‌ఎస్ యాక్ట్ ప్రకారం విచారణ చేస్తున్నట్టు తెలిపారు.




