
వాషింగ్టన్ : ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తత , యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచస్థాయిలో వెండి ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. సోమవారం ఈ అత్యధిక రేట్ల స్థాయికి వెండి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేశారు. ఇరాన్, అమెరికా పరస్పర దాడుల హెచ్చరికలు తీవ్రతరం అయ్యాయి. సోమవారం నుంచి ఆరంభమమ్యే మార్కెట్ సూచీ అంచనాలు ఇప్పుడు వెలువడ్డాయి. అనుబంధ డిమాండ్లతో వెండి వాడకం పెరుగుతుంది. దీనితో వచ్చే వారం వెండి ధర కిలోకు రూ 2,60,000 నుంచి రూ 2,70,000 స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. వెండి ఆభరణాల వాడకం ఎక్కువగా ఉండే భారతదేశంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.




