
ఖమ్మం నగరంలోని ఖిల్లా బ్రాహ్మణ బజార్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. పాల్వంచ పట్టణానికి చెందిన యువతిని దుండగుడు అతి కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. యువతి మృతదేహాన్ని చూసి స్థానికులు వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు . సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతదేహం సమీపంలో కొంత నగదు పడి ఉండటంతో నగదు కోసం చేసారా, యువతిని ఎవరైనా వేధిస్తూ చంపారా అన్నట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.యువతి పాల్వంచ పట్టణానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.ఓ షాపింగ్ మాల్ లో పని చేస్తూ, పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్ లో ఉంటుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




