Thursday, January 15, 2026
Google search engine
HomeUncategorizedశనివారం రాశి ఫలాలు (10-01-2026)

శనివారం రాశి ఫలాలు (10-01-2026)

మేషం

బంధు మిత్రులతో అకారణ కలహలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మాతృ వర్గ బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.

వృషభం

గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత మేలైన సౌకర్యాలుంటాయి. చిన్ననాటి మిత్రులతో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి.

మిధునం

సంతాన విద్యా విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితులతో ఒక వ్యవహారంలో మనస్పర్దలు కలుగతాయి.

కర్కాటకం

బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఇంటాబయట సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

సింహం

నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.సకాలంలో పనులు పూర్తికాక చికాకులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్య

అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో.ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వ్యాపారములలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు.

తుల

వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. దూరప్రాంత బంధువుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

వృశ్చికం

ముఖ్యమైన పనులలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలు గందరగోళ పరిస్థితులుంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొనటం మంచిది. ఆదాయానికి ఇబ్బందులు తప్పవు. నూతన ఋణయత్నాలు నిదానంగా సాగుతాయి.

ధనస్సు

మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికామౌతాయి.

మకరం

సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత సానుకూలంగా సాగుతాయి.

కుంభం

ధన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.

మీనం

నిరుద్యోగుల కష్టం ఫలించదు. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments