
ముంబై: 2014, 2019లో మోడీ ప్రధాని కావడానికి రెండు సార్లు సహకరిస్తే ఇప్పుడు నా పార్టీనే చీల్చివేశారని శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాక్రే గురువారం వ్యాఖ్యానించారు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ మోడీ తప్పనిసరిగా ప్రధాని కావాలని తాను ప్రచారం చేయగా, ఇప్పుడు నేను అంతం కావాలని మోడీ చెబుతున్నారని థాక్రే ఆరోపించారు.
ఈ రెండు అంశాలను తెలుసుకోవడం ప్రారంభించారని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి ముంబైని వేరు చేయాలన్నది బీజేపీ పాత స్వప్నమని చెప్పారు. బాలాసాహెబ్ లేరని వారు భావిస్తున్నారని,పేపర్‌పై సేనను వారు తుదముట్టించాలని ఆలోచించారని, కానీ క్షేత్రస్థాయిలో ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.




