Thursday, January 15, 2026
Google search engine
HomeUncategorizedగురువారం రాశి ఫలాలు (08-01-2026)

గురువారం రాశి ఫలాలు (08-01-2026)

మేషం

బంధువులనుండి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తల్లి తరపు వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులులో జాప్యం కలుగుతుంది. విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం

అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్రా వస్తు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన యోగం ఉన్నది సంతాన విద్యా ఉద్యోగ విషయాల శుభవార్తలు అందుతాయి.

మిధునం

వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో చిన్ననాటి మిత్రులతో పాల్గొంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు చేదాటిపోతాయి.

కర్కాటకం

వృత్తి వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.

సింహం

వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కన్య

వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. ఆర్థిక పరమైన చిక్కులు నుండి బయటపడతారు. వ్యాపారాలు అంచనాలను దాటి లాభాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు.

తుల

బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ధనపరంగా ఇబ్బందులను అధిగమించి ఋణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృశ్చికం

వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు

అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది.

మకరం

ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. ధనదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.

కుంభం

సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.

మీనం

ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరో బాధలు పెరుగుతాయి. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments