
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ రాజా సాబ్. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ‘రాజా సాబ్‘ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు ఈ నెల 9న ‘రాజా సాబ్‘ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. సోమవారం ఈ సినిమాలోని ’నాచె నాచె’ సాంగ్‌ను ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ తో నటించడం గౌరవంగా భావిస్తున్నా. పిల్లలు, పెద్దలు అంతా ఈ సినిమాను ఇష్టపడతారు”అని అన్నారు. నటుడు బొమన్ ఇరానీ మాట్లాడుతూ.. “ప్రభాస్‌తో సినిమా అనగానే నేను కథ, క్యారెక్టర్ ఏంటని కూడా అడగకుండా ఈ సినిమా ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ మారుతికి, నిర్మాత విశ్వప్రసాద్‌కి థ్యాంక్స్”అని తెలిపారు. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ “మా సంస్థ నుంచి ఇప్పటిదాకా కార్తికేయ, జాట్, మిరాయ్ సినిమాలను ఇక్కడ రిలీజ్ చేశాం. ఇప్పుడు మా సంస్థలో అతి పెద్ద మూవీ రాజా సాబ్‌ను బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్‌తో నిర్మించాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు రిద్దికుమార్, మాళవిక మోహనన్, జరీనా వాహబ్ తదితరులు పాల్గొన్నారు.




