
ముంబై: బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తఫిజుర్ రహ్మాన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం గట్టి షాక్ ఇచ్చింది. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో ఐపిఎల్‌లో ఆడకుండా ముస్తఫిజుర్ రహ్మాన్‌ను చూడాలనే డిమాండ్ ఊపందుకుంది. దీనిపై స్పందించిన భారత క్రికెట్ బోర్డు ఐపిఎల్ నుంచి ముస్తఫిజుర్‌ను తప్పించాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాన్యాన్ని ఆదేశించింది.
బిసిసిఐ ఆదేశాల మేరకు కోల్‌కతా టీమ్ ముస్తఫిజుర్‌ను జట్టులో నుంచి తొలగించింది. ఈ విషయాన్ని కెకెఆర్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. తనను ఐపిఎల్ నుంచి తొలగించడంపై ముస్తఫిజుర్ రహ్మాన్ స్పందించాడు. బిసిసిఐ ఆదేశించిన నేపథ్యంలో కోల్‌కతా యాజమాన్యం కూడా ఏమీ చేయలేదని, ఈ విషయంపై తాను మాట్లేడేది ఏమీ లేదని పేర్కొన్నారు.




