
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ మౌసమ్ నూర్ శనివారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తిరిగికాంగ్రెస్‌లో చేరారు. 46 ఏళ్ల నూర్ 2009 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున మాల్దా స్థానం నుంచి రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీఎంసీలో చేరిన ఆమె రాజ్యసభకు ఎంపికయ్యారు. మౌసమ్ నూర్ రాజ్యసభ గడువు ఏప్రిల్‌తో ముగియనున్నది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మాల్దా నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఢిల్లీ లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు జైరామ్ రమేశ్, గులాం అహ్మద్‌మీర్ , శుభంకర్ సర్కార్ సమక్షంలో నూర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.




