
బెంగళూరు: కన్నడ, తమిళ టీవీ యువనటి నందిని సిఎం ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని ఆర్ఆర్ నగర్లో ఓ పేయింగ్ గెస్ట్ హౌస్‌లో ఉంటున్న ఈ నటి తన గదిలో ఫ్యాన్స్‌కు ఉరివేసుకుని చనిపోయి ఉండగా గుర్తించారు. పోలీసు వర్గాలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి, ఉన్నత ఉద్యోగ సంబంధిత విషయాలతో ఆమె అంతర్గత సంఘర్షణ ఎదుర్కొంటున్నారని, ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సన్నిహితులు తెలిపారు. పలు సీరియల్స్‌తో తీరిక లేకుండా ఉన్న ఆమె విషాదాంతంతో కన్నడ, తమిళ టీవీ పరిశ్రమలో తీవ్ర కలకలం , విషాదం అలుముకుంది.




