Thursday, January 15, 2026
Google search engine
HomeUncategorizedచైనా రైలు ప్రపంచ రికార్డు

చైనా రైలు ప్రపంచ రికార్డు

అత్యంత వేగవంతపు రైళ్లలో చైనా ప్రపంచ రికార్డు స్థాపించింది. సాంకేతికతలో తన ఉడుంపట్టు మరింత బిగిస్తూ మరింత దూసుకువెళ్లింది. ప్రపంచ స్థాయి అత్యంత వేగవంతపు అయస్కాంత క్షేత్ర నిర్వహణతో ముందుకు వచ్చింది. రెండు సె కండ్లలో గంటకు 700 కిలోమీటర్ల వేగంతో దూరా న్ని ఛేదించే దిశలో మాగ్లేవ్ ట్రైన్లు తీసుకురానుంది. నిర్ణీత స్టేషన్‌లో అంతా చూస్తూ ఉండగానే ఈ ట్రైన్ కళ్ల ముందు నుంచి రెప్పపాటు కాలంలోనే దూసుకువెళ్లడం, అత్యంత వేగంగా ముందుకు వెళ్లినా, చె క్కుచెదరకుండా సెకండ్లలో నిలిచిపోవడం జరిగిం ది. సంబంధిత ప్రయోగాన్ని ఇటీవల చైనా డిఫెన్స్ టెక్నాలజీ వర్శిటీ పరిశోధకలు ప్రయోగాత్మకంగా విజయవంతంగా నిర్వహించారు. పట్టాలపై రైలు ఉన్నట్లుగా కూడా అన్నించదు. పైగా మన ముందు నుంచి రైలు దూసుకువెళ్లినట్లు కూడా తెలియదు.

అయస్కాంత శక్తితో సాగే ఈ రైళ్లు దాదాపు వేయి కిలోల లోడ్‌తో వెళ్లగలవు. అనూహ్య రీతి వేగం సం తరించుకుని ఉండే ఈ రైలు నమూనా ప్రయోగా న్ని ఇటీవల ప్రత్యేకంగా రూపొందిన మాగ్నెట్ రై లు పట్టాలపై నిర్వహించారు. ఈ క్రమంలో 400 మీటర్ల ట్రాక్‌పై ఈ రైలు నిర్ణీత వేగం లక్షం సా దించిందని అధికారులు తెలిపారు. ఓ మెరుపు తీగ వేగాన్ని మించిపోయిన వేగంతో ఈ రైలు వెళ్లగల దు. పక్క నుంచి రైలు దూసుకువెళ్లిన అనుభూతి ఒ క్కటే మిగులుతుంది. సైన్స్ చిత్రాలలోని స న్నివేశాలను తలపిస్తుంది. నమూనా ప్రయోగాన్ని అతి తక్కువ దూరపు లక్షంతో విజయవంతం చేసినందున దూర ప్రాంతాలకు ఇదే వేగంతో సాగే రైళ్ల ను నిర్వహించడం తేలికగా భావిస్తున్నామని చైనా సాంకేతిక విషయాల నిపుణులు తెలిపారు. భవిష్యత్తులో ఈ రైలు టెక్నాలజీని వ్యాక్యూమ్ సీల్డ్ ట్యూ బ్ ద్వారా ప్రయాణాలకు వాడుతారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments