Friday, January 16, 2026
Google search engine
HomeUncategorizedసోనియా, రాహుల్ కు ఊరట

సోనియా, రాహుల్ కు ఊరట

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి కొంత ఊరట లభించింది. ఈ కేసులో సోని యా, రాహుల్ తో పాటు ఐదుగురిపై ఎన్ ఫో ర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన తాజా చార్జిషీట్ ను పరిగణన లోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లపై ఢిల్లీ పోలీసులు నమో దు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని అందించాలని ఆదేశిస్తూ మెజిస్టీరియల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ కోర్టు పక్కన పెట్టింది. ఈ కేసులో సోని యా, రాహుల్ ఇతరులు ఎఫ్‌ఐ ఆర్ కాపీని అం దుకునేందుకు అర్హులు కాదని వాదిస్తూ, మెజిస్టీరియల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విచారించారు. అయితే, ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు నిందితులకు తెలియజేయవచ్చని న్యాయమూర్తి తీ ర్పునిచ్చారు. మనీలాండరింగ్ దర్యాప్తులో భా గంగా, ఈడి చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు అక్టోబర్ 3న నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ,

రాహుల్ ఇతర నిందితులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. గాంధీ కుటుంబం వ్యక్తిగత లాభాల కోసమే తమ పదవిని దుర్వినియోగం చేసుకున్నారనే ఆరోపణలపై ఈడీ ఫి ర్యాదు చేసింది. సోనియా, రాహుల్ తో పాటు కాంగ్రెస్ నాయకులు సమన్ దూబే, శామ్ పి ట్రోడా, యంగ్ ఇండియన్ (వైఐ), డోటెక్స్ మ ర్చండైజ్ లిమిటెడ్, డోటెక్స్ ప్రమోటర్ సునిల్ భండారి, అసోసియేట్ జర్నల్ (ఏజేఎల్) ఇతరులపై ఎఫ్ ఐఆర్ లో నేరపూరిత కుట్ర, ఆస్తి దుర్వినియోగం, నమ్మకద్రోహం, మోసం అభియోగాలను పోలీసులు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన చార్జీషీటులో ఈడి ఈ సంస్థలను కూడా నిందితులుగా పేర్కొన్నది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ ఏ) లోని సెక్షన్ 66(2) కింద లభించే అధికారాలను ఉపయోగించి ఈడీ పోలీసు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించింది. నేషనల్ హెరాల్డ్ కేసు లో సోనియా, రాహుల్ మరో ఐదుగురిపై ఈడీ మనీలాండరింగ్ అభియోగాన్ని పరిగణనలోకి తీసుకోడానికి కోర్టు మంగళవారం నిరాకరించింది. ఒక ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదుపై దర్యాప్తు ఆధారంగా చార్జిషీట్ ఉందని, ప్రిడికేట్ నేరం ఎఫ్‌ఐఆర్ కు ఆధారం కాదని కోర్టు పేర్కొంది.

కొత్త చార్జిషీట్ దాఖలు చేయనున్నఈడీ

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోనియాగాం ధీ, రాహుల్, ఇతరులపై కొత్త చార్జిషీట్ దాఖ లు చేయనుందని అధికారులు మంగళవారం తెలిపారు. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ ఐఆర్ ను పరిగణనలోకి తీసుకుని ఈడీ కొత్త చార్జిషీట్ దాఖలు చేస్తుంది. మంగళవారం ఉద యం ట్రయల్ కోర్టు ఏప్రిల్ లో వీరిపై ఈడీ దా ఖలు చేసిన చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది.

ఈడి చార్జ్ షీట్ ఒక ప్రైవేటు ఫిర్యాదు, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తీసుకున్న విచారణ ఆదారంగా ఉందని, మనిలాండరింగ్ చట్టం కింద నిర్దేశించిన ఆధారం గా ఎఫ్ ఐఆర్ లేదని కోర్టు పేర్కొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments