Friday, January 16, 2026
Google search engine
HomeUncategorizedయాషెస్ సిరీస్‌.. ఆస్ట్రేలియా ఘన విజయం

యాషెస్ సిరీస్‌.. ఆస్ట్రేలియా ఘన విజయం

బ్రిస్బేన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం సాధించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో ఐదుమ్యాచ్‌ల సిరీస్‌లో 20 ఆధిక్యాన్ని అందుకుంది. 134/6తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను తిరిగి ఆరంభించిన ఇంగ్లండ్ 241 పరుగులకు ఆలౌటైంది.

బెన్ స్టోక్స్ (50), విల్‌జాక్స్ (41) ఏడో వికెట్‌కు 96 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ ఆ మాత్రమైన స్కోరును సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నీసర్ ఐదు, స్టార్క్ రెండు వికెట్లను పడగొట్టారు.ఇక 65 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. స్టీవ్ స్మిత్ 23 (నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 511 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియాకు 177 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments