Thursday, March 5, 2026
Google search engine
HomeUncategorizedస్పీకర్ నుంచి నోటీసు రాలేదు: ఎంఎల్ఎ దానం

స్పీకర్ నుంచి నోటీసు రాలేదు: ఎంఎల్ఎ దానం

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నుంచి తనకు ఎటువంటి నోటీసు రాలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బుధవారం పీపుల్స్ ప్లాజాలో జరిగిన హోళి వేడుకల్లో దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హుషారుగా నృత్యం చేశారు. అనంతరం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ అనర్హత పిటిషన్‌కు సంబంధించి గురువారం (5)న హాజరుకావాల్సిందిగా స్పీకర్ నుంచి నోటీసు ఏదీ రాలేదన్నారు. గురువారం దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై స్పీకర్ ఇరుపక్షాల (పిటిషనర్, రెస్పాడెంట్ల) వాదనలు విననున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే దానం తనకు నోటీసు రాలేదని చెప్పారు.

స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ నెల 10వ తేదీలోగా పెండింగ్‌లో ఉన్న కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వనున్నారన్న ప్రచారం జరుగుతున్నది. స్పీకర్‌పై దాఖలైన ధిక్కరణ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ నెల 12న సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు విచారణకు రానున్నది. ధిక్కరణ పిటిషన్‌పై విచారణకు ముందే స్పీకర్ తీర్పు వెలువరించే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments