
మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా తీవ్రత ఉండనుందని, పగలు, రాత్రి వేళల్లో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని శనివారం విడుదల చేసిన వెదర్ ఔట్‌లుక్‌లో తెలిపింది. తెలంగాణలో మార్చి-మే నెలల మధ్య ఎండ తీవ్రతతో పాటు వడగాలులు వీ చే రోజుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాగే మా ర్చి నెలలో అధిక ఉష్ణోగ్రతలతో పాటుగా వర్షపా తం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దీని వ ల్ల వేడిగాలులు సాధారణ స్థితిలోనే నమోదవుతా యి. ఏప్రిల్ నుంచి మే నెల వరకు పగలు, రాత్రి వేళలో ఎక్కువ వేడి పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ మేరకు హై దరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు తా గునీటి సరఫరాలో లోటుపాట్లు లేకుండా, ప్రభు త్వం అన్ని విధాలుగా ఆరోగ్యపరమైన నిఘా ఏ ర్పాటు చేయాలని ఐఎండీ సూచించింది.అదే దేశవ్యాప్తంగా చూస్తే పశ్చిమ రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణా, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఝార్ఖం డ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర కర్ణాటక, ఉత్తర తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని ఐఎం డీ తెలిపింది.ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను 25 డిగ్రీల వద్దే నడుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.




