Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedబాల్కసుమన్‌కు బెయిల్

బాల్కసుమన్‌కు బెయిల్

 బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరైంది. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి ము న్సిపా లిటిలో గత నెల 17న నెలకొన్న సంఘటనపై చెన్నూర్ మాజీ ఎం ఎల్‌ఎ బాల్క సుమన్ తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా జైలుకు పంపించిన విషయం తెలిసిందే. సోమవారం జిల్లా కో ర్టులో రామకృష్ణాపూర్ క్యాతనపల్లి కేసు విషయంలో బాల్క సుమన్‌తో పాటు మరో ముగ్గురికి బెయిల్ మంజూరైనట్లు సుమన్ తరపున న్యా యవాది రవీందర్‌రావ్ తెలిపారు. రూ.25వేల, రెండు షూరిటీలతో వారి కి బెయిల్ మంజూరైనట్లు ఆయన తెలిపారు. జిల్లా కోర్టులో బెయిల్ మం జూరు అయినప్పటికి షురిట్లు కార ణంగా సుమన్ రిలీజ్ కు మరో రెండు రోజులు పట్టవచ్చని ఆయన తెలిపారు.

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో కానిస్టేబుల్ గాయపడగా దేవాపూర్ ఎస్‌ఐ గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసారు. అం దులో బాల్క సుమన్ మూల రాజిరెడ్డి, అనిల్, మరోకరిని అరెస్టు చేసి రి మాండ్‌కు పంపించగా న్యాయమూర్తి వారికి 14రోజుల రిమాండ్ విధిం చారు, దీంతో వారు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్నారు. సోమ వారం మంచిర్యాల జిల్లా కోర్టులో న్యాయవాది బాల్క సుమన్, మరో ముగ్గురికి బెయిల్ పిటిషన్ వేయగా వారికి న్యాయమూర్తి బెయిల్ మం జూరు చేసినట్లు ఆయన తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో 3 నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గం టల వరకు ఖండిషన్ విధించినట్లు తెలిపారు. పిటి వారెంట్‌ల విషయంలో కూడా న్యాయ సలహాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments