Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedవార ఫలాలు (01-03-2026 నుండి 07-03-2026 వరకు)

వార ఫలాలు (01-03-2026 నుండి 07-03-2026 వరకు)

మేష రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. సంతానం యొక్క విద్యా విషయాల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయ దర్శనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. పనులలో ఆటంకాలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. ఆఫీసులో పై అధికారులు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మనోవేదన ఎక్కువగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయమై శ్రద్ద అవసరం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహ పరుస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షా సమయం. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారాలి అని అనుకునే వారికి కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. నూతన గృహం కొనుగోలు చేయాలి అనే కల నెరవేరుతుంది. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. మంగళవారం శనివారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

వృషభ కాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వచ్చినా ఆదాయం కంటే కూడా ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. నలుగురిలో ప్రత్యేకంగా కనపడడానికి ఎక్కువగా కష్టపడతారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులకు కలిసివచ్చే కాలంగా చెప్పవచ్చు చదువుపై శ్రద్ధ వహించండి. మీ అంచనాలను అందుకుంటారు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చ సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

మిధున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా లాభసాటిగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి డాక్టర్లకి లాయర్లకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రే.

కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. నూతన పెట్టబడులు పెట్టడానికి నూతన వ్యాపారం ప్రారంభించడానికి కాలం అనుకూలంగా లేదు. దూర ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ పొంతనలు చూసుకుని ముందుకు వెళ్ళండి. విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాంట్రాక్టర్లకు హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి మంచినీళ్ల వ్యాపారం చేసే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మీరు రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటను ఇస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టపడి చదవండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలి అని ఆలోచనలు వస్తాయి. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది కావున శనికి తైలాభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్ధిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. భూ సంబంధిత వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వివాదాలకు తగాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ద్విస్వభావ ఆలోచనలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. శనివారం మరియు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు బాగున్నాయి. ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. విదేశీ సంబంధిత విషయాలు వీసా పాస్పోర్ట్ వంటివి లభిస్తాయి. వ్యాపార పరంగా కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. ప్రతి పనిలో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంటుంది మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మీరు అనుకోని అవకాశాలు చేతికి అందుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. వ్యాపారంలో మీతో విభేదించినవారే దగ్గరవుతారు. పునర్ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరున్. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది. ఆరోగ్యపరంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. రాజకీయరంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యల నుండి చాకచక్యంగా బయటపడతారు. విద్యార్థిని విద్యార్థులకు ఇది పరీక్షా సమయం. కష్టేఫలి అన్నట్టుగా ఫలితాలు ఉంటాయి. దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు కొంత చికాకు కలిగిస్తాయి. కుటుంబంలో సహోదరీ సహోదరుల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. శ్రమతో కూడిన ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార పరంగా నూతన ఆలోచనలను అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. దైవ భక్తి పెరుగుతుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది. నలుపు వత్తులతో శనివారం రోజున శని గ్రహం దగ్గర దీపారాధన చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. మీ రాశి వారికి కలిసి వచ్చేసరికి 5 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఇదేనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి వారికి వారం అనుకూలంగానే ఉంది. వ్యాపారపరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. డబుల్ రిజిస్ట్రేషన్ పట్ల జాగ్రత్త వహించాలి. సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిన రావచ్చు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు నిరాశ వారికి ఏలిన నాటి శని నడుస్తుంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. చదువుపై శ్రద్ధ వహించండి. ప్రతిరోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు నాగ సింధూరం నుదుటన ధరించండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. విదేశీ ప్రయాణం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. నూతన వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది శనికి తైలాభిషేకం చేయించండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి హనుమాన్ లాకెట్ మెడలో ధరించండి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసివచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments